మార్కెట్ ఢమాల్‌‌.. 671 పాయింట్లు పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌

మార్కెట్ ఢమాల్‌‌.. 671 పాయింట్లు పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌
  •     గ్లోబల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లలో నెగెటివ్ ట్రెండ్‌‌‌‌

ముంబై: బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు శుక్రవారం సెషన్‌‌‌‌లో ఒక శాతం మేర పతనమయ్యాయి. ఈ నెల చివరిలో జరనున్న మీటింగ్‌‌‌‌లో వడ్డీ రేట్లను  ఫెడ్ ఎక్కువగా పెంచుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా యూఎస్‌‌‌‌లో బ్యాంకింగ్ సంక్షోభం నెలకొనడంతో  గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌‌‌‌లు పతనమయ్యాయి.  సెన్సెక్స్ శుక్రవారం 671 పాయింట్లు (1.12 శాతం) నష్టపోయి 59,135 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 17,413 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ.1.36 లక్షల కోట్లు తగ్గింది.  రెండు బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు కూడా  ఈ వారాన్ని ఒక శాతం లాస్‌‌‌‌తో ముగించాయి. గ్లోబల్ మార్కెట్‌‌‌‌లు నెగెటివ్‌‌‌‌లో కదలడంతో  ఇండెక్స్‌‌‌‌లు శుక్రవారం నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత కిందకు పడ్డాయి. లోవర్ లెవెల్స్‌‌‌‌లో బయ్యింగ్‌‌‌‌ రావడంతో కొంత నష్టాలను తగ్గించుకోగలిగాయి. వడ్డీ రేట్లను ఫెడ్ మరింత పెంచుతుందనే అంచనాలు ఎక్కువవ్వడంతో గ్లోబల్ మార్కెట్‌‌‌‌లు జాగ్రత్త పడుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. యూఎస్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ డేటా, జాబ్స్ డేటా వెలువడే ముందు  మార్కెట్‌‌‌‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని వివరించారు. కాగా, ఫిబ్రవరిలో యూఎస్‌‌లో 3.11 లక్షల కొత్త జాబ్స్ యాడ్‌‌ అయ్యాయి. అంతకు ముందునెలతో  పోలిస్తే కొద్దిగా తగ్గాయి. అన్‌‌ఎంప్లాయ్‌‌మెంట్‌‌ రేటు3.6% కి పెరిగింది.

మార్కెట్ ఎటువైపు..?

గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో కదలడంతో డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌  వరుసగా రెండో సెషన్‌‌‌‌లో కూడా నష్టపోయిందని  కోటక్ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ అమోల్‌‌‌‌ అథవలే అన్నారు.  అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని, ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీగా పడ్డాయని పేర్కొన్నారు. రేట్లను మరింతగా పెంచుతామని ఫెడ్ చైర్మన్‌‌‌‌ ప్రకటించడంతో మార్కెట్‌‌‌‌లో సెంటిమెంట్ మారిందని, యూఎస్ ఎకానమీ రెసిషన్‌‌‌‌లోకి జారుకుంటుందనే భయాలు ఎక్కువయ్యాయని అన్నారు. ‘నిఫ్టీ వీక్లీ చార్ట్‌‌‌‌లో పెద్ద బేరిష్ క్యాండిల్‌‌‌‌ను ఏర్పరిచింది. 20, 50 రోజుల  మూవింగ్ యావరేజ్‌‌‌‌కు దిగువన ట్రేడవుతోంది. షార్ట్ టర్మ్‌‌‌‌లో 17,550  రెసిస్టెన్స్‌‌‌‌గా పనిచేస్తుంది. దిగువన 17,150 వరకు పడొచ్చు’ అని పేర్కొన్నారు. ఫుల్ బ్యాక్ ర్యాలీ వస్తే 17,480 – 17,500 వరకు నిఫ్టీ కదలొచ్చని పేర్కొన్నారు. డైలీ చార్ట్‌‌‌‌లో  200 ఎస్‌‌ఎంఏ దగ్గరలో నిఫ్టీ ముగిసిందని, ఈ లెవెల్‌‌‌‌ను కాపాడుకోవడానికి బుల్స్‌‌‌‌, బేర్స్‌‌‌‌ తీవ్రంగా పోటీపడతాయని ఎనలిస్టులన్నారు.