నిమ్మ రసం – తేనె కలిపి చర్మానికి రాసుకుంటే.. ఎలాంటి ఉపయోగాలు

నిమ్మ రసం – తేనె కలిపి చర్మానికి రాసుకుంటే.. ఎలాంటి ఉపయోగాలు

ఆరోగ్యానికి నిమ్మ , తేనె ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయ ,తేనెలో ఉండే   ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి ఉపయోగపడతాయి. ఇక ఎండాకాలంలో తరచూ చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.  ఈ పరిస్థితిలో నిమ్మ, తేనెను ఉపయోగిస్తే ముఖానికి అనేక రకాల ఉపయోగాలే కాకుండా .. ముఖానికి ఉండే సౌందర్యం అంతా ఇంతాకాదు.  వీటిని ఉపయోగిస్తే 60 ఏళ్ల వృద్దులు 16 ఏళ్ల పడుచుల వలె కనిపిస్తారు.  మరి తేనె, నిమ్మ వల్ల కలిగే లాభాలను  తెలుసుకుందాం,  ,

ముఖం కోసం నిమ్మ మరియు తేనె ప్రయోజనాలు ఏంటంటే..

నిమ్మ, తేనెలో  ఔషధగుణాలు అందాన్ని రెట్టింపు చేయటంతోపాటు, చర్మానికి మేలు చేస్తుంది. చర్మ సమస్యలు కూడా సులువుగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  వేసవిలో ఎండ వేడికి చర్మం బర్న్ అయి,  హైపర్ పిగ్మెంటేష్ సంభవించే అవకాశం ఉంది.  అంతే కాకుండా డీహైడ్రేషన్ సమస్యలు చర్మంపై కనపడతాయి.  ఈ సమస్యలన్నింటికీ చికిత్స చేయడానికి తేనె , నిమ్మకాయలను ఉపయోగించవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్ కూడా ఉపయోగపడి .. వివిధ రకాల ముఖ సమస్యలకు చెక్ పెడుతుంది. 

సన్ బర్న్ కు మంచి చికిత్స...

ఈ రోజుల్లో వడదెబ్బ సమస్య సర్వసాధారణమైపోతోంది.  నిమ్మ,  తేనె రెండింటిలో కూడా ఔషధ గుణాలు ఉండి..  వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. నిమ్మ రసం, తేనె కలిపి  ముఖంపై రాసుకుంటే  ఎండ వేడి నుంచి  ఉపశమనం పొందవచ్చు.  నిమ్మరసం తీసుకుని, అందులో తేనె మిక్స్ చేసి, మీ ముఖానికి అప్లై చేయండి. కాసేపు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి.

పిగ్మెంటేషన్ కోసం ...

తేనె,నిమ్మరసం రెండూ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి , సిట్రిక్ యాసిడ్ ఉన్నాయి, ఇవి ముఖంపై పిగ్మెంటేషన్‌ను కాంతివంతం చేసి ..  చర్మం రంగును మెరుగుపరుస్తాయి. తేనె, నిమ్మరసం , కలబందను మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. ఇలా కాసేపు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి.

 పొడి చర్మం కోసం ...

పొడి చర్మం సమస్యకు తేనె , నిమ్మకాయల వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి చర్మంలో తేమను లాక్ చేసి... పొడి చర్మం సమస్యను తగ్గిస్తాయి. ఇంకా  కొల్లాజెన్‌ని పెంచి.. చర్మం ముడతలను తగ్గిస్తుంది.

 మొటిమలు తగ్గడం కోసం..

మొటిమల నివారణకు తేనె మరియు నిమ్మకాయల వాడకం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండూ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో నిండి చర్మంపై మొటిమల సమస్యను తగ్గిస్తాయి.  నిమ్మరసం తీసుకుని అందులో తేనె కలపండి. కావాలంటే లవంగం లేదా కర్పూరం నూనె కూడా వేసి ముఖానికి రాసుకోవచ్చు. ఇది మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది