అలోవెరాతో అందం పెరిగి.. తలలో చుండ్రు తగ్గుతుంది

అలోవెరాతో అందం పెరిగి.. తలలో చుండ్రు తగ్గుతుంది

తలలో చుండ్రు ఇబ్బంది పెడుతుంటే.. ఒక టేబుల్ ​స్పూన్​ నిమ్మరసంలో రెండు టేబుల్​స్పూన్ల అలోవెరా జెల్​ని కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్​గా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.

మొటిమలు, మచ్చలకు చెక్​ పెట్టాలంటే.. రాత్రి పడుకునే ముందు మచ్చల మీద అలోవెరా జెల్​ అప్లై చేసి.. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగితే మార్పు కనిపిస్తుంది.

చిక్కుబడిన వెంట్రుకలు సులభంగా విడిపోవాలంటే.. అలోవెరా జెల్​ రాస్తే సరి.

కళ్లకింద ఉండే నల్లటి వలయాలు పోవాలంటే రెండు టేబుల్ ​స్పూన్ల అలోవెరా జెల్​లో ఒక టేబుల్​ స్పూన్​ బాదం ఆయిల్​ కలిపి పేస్టులా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు నల్లటి వలయాల మీద ఆ జెల్​ అప్లై చేయాలి. ఇలా వారంరోజులు చేస్తే నల్లటి వలయాలు మాయం.

అలోవెరాలోని మాలిక్​ యాసిడ్​ చర్మం మీద ముడుతలను తొలగిస్తుంది. చర్మానికి సాగే గుణాన్ని పెంచుతుంది. చర్మాన్ని తేమగా ఉంచి.. అందాన్ని రెట్టింపు చేస్తుంది.

పాదాలపై ఏర్పడ్డ పగుళ్లు తొలగి పోవాలంటే.. అలోవెరాగుజ్జును అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్​గా చేస్తే.. మీ పాదాలు సుకుమారంగా అవుతాయి.