
ఆరోగ్య సందేశ్ పేరుతో బెంగాల్ సర్కార్ స్వీట్ తయారీ
కోల్‌కతా: స్వీట్స్‌ను ఎక్కువగా ఇష్టపడే బెంగాలీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి వార్తను అందించింది. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సందేశ్ అనే స్వీట్‌ను ప్రజలకు అందించాలని మమత సర్కార్ నిర్ణయించింది. ఈ స్వీట్స్ తయారీలో సుందర్‌బన్ అడవుల్లోని తేనెను వాడుతున్నారు. ఆవు పాలతో పాటు సుందర్‌బన్ అడవుల్లోని స్వచ్ఛమైన తేనెతోపాటు తులసి ఆకులను కూడా సందేశ్ తయారీలో ఉపయోగిస్తున్నట్లు యానిమల్ రీసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్‌ను కలపకుండా రూపొందిస్తున్న ఈ స్వీట్స్‌ను డిపార్ట్‌మెంట్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంచనున్నామని చెప్పారు. సందేశ్ స్వీట్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కానీ ఇది కరోనాకు యాంటీ డోట్ మాత్రం కాదని స్పష్టం చేశారు. ఇంకో రెండు నెలల్లో ఇది మార్కెట్‌లోకి రానుందని, ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందన్నారు.