ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన​ ఆఫీసర్ మిస్సింగ్

ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన​ ఆఫీసర్ మిస్సింగ్

కృష్ణా నగర్ (పశ్చిమ బెంగాల్): ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన ఆఫీసర్ కనబడకుండా పోయిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. 24 గంటలు గడిచినా ఆయన ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. నదియా జిల్లా రాణాఘాట్ లోక్ సభ నియోజకవర్గంలోని కృష్ణానగర్ లో  ఆర్ణబ్ రాయ్ కి ఈవీఎం, వీవీప్యాట్ ల ఇంచార్జిగా డ్యూటీ పడింది. మిగతా వారితో కలిసి పోలింగ్ ముందు రోజు బిప్రదాస్ చౌదరి పాలిటెక్నిక్ కాలేజ్ చేరుకున్నారు. తనకు కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకుని పొద్దున్నే కృష్ణానగర్ పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. పోలింగ్ ముగిసినా ఆయన జాడలేదు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు . సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆర్ణబ్ ఆచూకీ కనుగొనేం దుకు ప్రయత్నించగా.. జిల్లాలోని శాంతిపూర్ లో చివరిసారిగా సిగ్నల్స్ ​అందాయి. తర్వాత ఆర్ణబ్ రెండు సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసులు చెప్పారు.