బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ కన్నుమూత 

బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ కన్నుమూత 

బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ  (24)  కన్నుమూసింది. బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ నెల 1 న కోల్ కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆండ్రిలా చేరింది.  పలుమార్లు ఆమెకు గుండెపోటు రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.  గతంలో క్యాన్సర్ ను జయించిన ఆండ్రిలా ... ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడం అందరికీ షాక్ కు గురిచేస్తుంది.   అండ్రిలా బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి ఆమె బతకాలని ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులను కోరారు.

బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో పుట్టిన ఆండ్రిలా...  జుమూర్‌తో అనే సీరియల్ తో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టింది.  అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో నటించింది. ఆండ్రిలా మృతిపట్ల బెంగాలీ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.