PBKS vs RCB : శివమెత్తిన సిరాజ్.. RCB గ్రాండ్ విక్టరీ

PBKS vs RCB : శివమెత్తిన సిరాజ్.. RCB గ్రాండ్ విక్టరీ

మొహాలిలో మహమ్మద్ సిరాజ్ విజృంభించాడు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసి.. బెంగళూరుకు విజయాన్ని అందించాడు. బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేని పంజాబ్.. 19 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు 24 పరుగుల తేడాతో పంజాబ్ జట్టును ఓడించింది.

పంజాబ్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (46, 30 బంతుల్లో), చివర్లో జితేశ్ శర్మ (41, 27 బంతుల్లో) మినహా ఏ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. హర్ ప్రీత్ సింగ్ భాటియా (13, 9 బంతుల్లో), సామ్ కరన్ (10, 12 బంతుల్లో), హర్ ప్రీత్ బ్రార్ (13, 13 బంతుల్లో) పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ సూపర్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హసరంగకు 2 వికెట్లు, హర్షల్ పటేల్, పార్నెల్ కు చెరో వికెట్ దక్కింది.

మొదటి ఇన్నింగ్స్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 174 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లను చితకొట్టారు. 16 ఓవర్ల వరకు క్రీజులో నిలబడి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59, 47 బంతుల్లో), డుప్లెసిస్ (84, 56 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 16 ఓవర్ వరకు వికెట్ పడకుండా క్రీజులో నిలబడ్డారు. దీంతో బెంగళూరుకు భారీ టార్గెట్ చేరుకోగలిగింది. ఓపెనర్లు మినహా.. ఏ బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేకపోయారు.

మ్యాక్స్ వెల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఫినిషర్ గా వచ్చిన దినేష్ కార్తిక్ (7, 5 బంతుల్లో) మరోసారి నిరాశ పరిచాడు. మహిపాల్ రామ్ రోర్ (7, 9బంతుల్లో), షబాజ్ అహ్మద్ (5, 3 బంతుల్లో) బ్యాటుతో ఆకట్టుకోలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ కు రెండు వికెట్లు దక్కాయి. అర్ష్ దీప్ సింగ్, నాథమ్ నిల్ చెరో వికెట్ తీసుకున్నారు.