
బెంగళూరు ఓ ఆటో ఫొటో వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్ కూర్చొనేందుకు ఆఫీసులో ఉపయోగించే వీల్ చైర్ వేసుకున్నాడు. ఆఫీసులో కూర్చున్నా.. ప్రయాణంలో కూర్చున్నా.. ఇంకెక్కడైనా.. ఏ సందర్భంలోనైనా కూర్చోవాల్సి వస్తే కంఫర్ట్ గా ఉండే కుర్చీని తీసుకుంటారు. ఒకవేళ వారు కూర్చునే చోట లేకపోతే కంఫర్ట్ చైర్ తెచ్చుకుంటారు. సాధారణంగా ఆటోల్లో పొడవాటి సీటు ఉంటుంది. అందులోనే అందరూ కూర్చుంటారు. ఇక డ్రైవర్ కూర్చొనేందుకు స్టీరింగ్ వెనుక చిన్న సీటు ఉంటుంది.
కాని బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ కూర్చొనేందుకు ఆపీసులో ఉండే లాంటి వీల్ చైర్ వేసుకున్నాడు. . అయితే ఈ ఆటోలో అధికంగా చార్జీ వసూలు చేయడంతో ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. బెంగళూరులో నివసించే వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఈ ఆటోను చూస్తే అర్దమవుతుంది.
- ALSO READ | టెక్నో నుంచి ఫాంటమ్ వీ ఫ్లిప్ ఫోన్
అనుజ్ బన్సల్ అనే వ్యక్తి X ట్విట్టర్ లో ఆటోలో ఆపీస్ లో ఉపయోగించే వీల్ చైర్ ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. టెక్ ఉద్యోగులు ఎందుకు సరదాగా ఉండాలని ఒకరు పోస్ట్ చేయగా మరొకరు మీరు బెంగళూరులో ఉన్నారని నాకు తెలుసని రాశారు. మరొకరు ఫన్నీగా ఇది గేమింగ్ చైర్ అంటూ సీరియస్ గా ఉండాలని పోస్ట్ చేశారు. ఇంకొకరు ఇది ఎర్గోనామిక్ రిక్షా అని ఫన్నీ కామెంట్ చేశారు.
Why should techbros have all the fun? 😏 pic.twitter.com/A5hnd0sDC8
— Anuj Bansal (@anuj63) September 22, 2023
గతంలో కూడా బెంగళూరులో ఓ ఆటో రిక్షా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక రంగుల LED లైట్లు ఆటోకు ఇరువైపులా అమర్చారు. అంతేకాదు డోర్, విండోలను గాజుతో డిజైన్ చేయించారు. బెంగళూరులో ఆటోల్లో కూడా లగ్జరీ జర్నీ చేసేలా ఆటోలను ముస్తాబు చేస్తున్నారు.