ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ .. దబాంగ్ ఢిల్లీ గెలుపు

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ .. దబాంగ్ ఢిల్లీ గెలుపు

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ పదో సీజన్‌‌‌‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టు తొలి విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ 38–31తో బెంగళూరు బుల్స్‌‌‌‌ను ఓడించింది. ఢిల్లీ కెప్టెన్ నవీన్‌‌‌‌ కుమార్ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించాడు. అషు మాలిక్ 9 పాయింట్లతో సత్తా చాటాడు. బుల్స్ తరఫున భరత్ 12,  సుశీల్ 5 పాయింట్లతో రాణించారు. మరో మ్యాచ్‌‌‌‌లో పుణేరి పల్టన్ 43–32తో యు ముంబాపై విజయం సాధించింది. శనివారం బెంగాల్‌‌‌‌ తో తమిళ్ తలైవాస్, ఢిల్లీతో హర్యానా పోటీ పడతాయి.