Cyber Crime : బెంగళూరు మహిళా లాయర్.. 36 గంటల డిజిటల్ అరెస్ట్.. షాక్ అయిన దేశం

Cyber Crime : బెంగళూరు మహిళా లాయర్.. 36 గంటల డిజిటల్ అరెస్ట్.. షాక్ అయిన దేశం

సైబర్ క్రైం.. డిజిటల్ క్రైం.. రోజు రోజుకు కొత్త కొత్తగా పుట్టుకొస్తుంది.. దేశంలో ఫస్ట్ టైం.. బెంగళూరుకు చెందిన ఓ మహిళా లాయర్.. 36 గంటలు.. అంటే ఒకటిన్నర రోజు డిజిటల్ అరెస్ట్ అయ్యింది.. డిజిటల్ అరెస్ట్ ఏంటీ అంటారా.. అదే ఇప్పుడు దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేస్తుంది.. సైబర్ క్రిమినల్స్ ఏ తరహాలో భయపెడుతున్నారు అనటానికి ఇదే నిదర్శనం.. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటీ.. మహిళా లాయర్ ఎలా మోసపోయింది అనేది పూర్తిగా తెలుసుకుందాం..

బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల మహిళ.. లాయర్ గా పని చేస్తున్నారు. ఆమెకు 2024, ఏప్రిల్ 9వ తేదీ రాత్రి ఓ వీడియో కాల్ వచ్చింది. అది ముంబై నుంచి.. సీబీఐ అధికారి అభిషేక్ చౌహాన్ గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో నలుగురు వీడియో కాల్ లో జాయిన్ అయ్యారు. అందులో ఒకరు థాయ్ లాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పరిచయం చేసుకున్నాడు..

Also Read :2.5 తులాలు దొంగిలించిన లేడీ చైన్‌‌ స్నాచర్‌‌

మహిళా లాయర్ పేరుతో ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫెడ్ ఎక్స్ పార్సిల్.. బెంగళూరు నుంచి థాయ్ లాండ్ కు ఓ పార్సిల్ వచ్చింది.. అందులో ఐదు నకిలీ పాస్ పోర్టులు, మూడు క్రికెట్ కార్డులు, 140 డ్రగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి.. మీరు మానవ అక్రమ రవాణాను పాల్పడుతున్నారు.. డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు.. విదేశాలకు డబ్బులు తరలిస్తూ మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. థాయ్ లాండ్ అధికారి నుంచి వచ్చిన సమాచారంతో.. మిమ్మల్ని మేం ప్రశ్నిస్తున్నాం అంటూ సీబీఐ అధికారిగా చెప్పుకున్న అభిషేక్ చౌహాన్ విచారణ ప్రారంభించాడు. 

అసలు నేను ఎలాంటి పార్సిల్ పంపించలేదని.. నా అధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాన్ కార్డు, క్రికెట్, డెబిట్ కార్డులు క్లీన్ గా ఉన్నాయని.. ఇన్ కం ట్యాక్స్ సక్రమంగా కడుతున్నానంటూ వివరణ ఇస్తూ వచ్చింది మహిళా లాయర్. ఈ క్రమంలోనే ఈ వివరాలు అన్నీ షేర్ చేయాలని కోరారు. ఈ విచారణ పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదని.. ఇందులో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల ప్రమేయం ఉందని.. వారికి ఈ విషయం లీక్ అయితే మీరు చిక్కుల్లో పడతారంటూ బెదిరించారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వొదని భయపెట్టారు. అంతే కాకుండా విచారణ పూర్తయ్యే వరకు వీడియో కాల్ నుంచి బయటకు వెళ్లకూడదని.. రెగ్యులర్ గా ఫేస్ స్క్రీన్ షేర్ చేయాలని.. లేకపోతే లోకల్ సీబీఐ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ బెదిరించారు. 

ఇంటర్నేషనల్ క్రైం అంటున్నారు.. ఫెడ్ ఎక్స్ లేదా ఇతర సంస్థల నుంచి నాకు ఎలాంటి మెయిల్, మెసేజ్ రాలేదని బాధితురాలు అనుమానంతో ప్రశ్నించింది.. ఇక్కడే సైబర్ కేటుగాళ్లు మరింత తెలివి చూపించారు. అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన నేరం అని.. మెయిల్, మెసేజ్ లు పంపిస్తే మిగతా నేరగాళ్లు అలర్ట్ అవుతారని.. అందరికీ తెలిస్తే.. మీకు మరిన్ని చిక్కులు వస్తాయంటూ బెదిరించారు. దీంతో ఆ మహిళా లాయర్ మిన్నకుండిపోయింది. 

ఓ వైపు థాయ్ లాండ్ ఆఫీసర్, మరో వైపు సీబీఐ, ఈడీ అధికారులు అందరూ వారు ఐడీ కార్డులు చూపిస్తుండటంతో.. నిజమే అనుకున్న మహిళా లాయర్.. తన వివరాలు అన్నీ వెల్లడించింది. ఆ తర్వాత ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి 10 లక్షల 79 వేలు.. క్రికెట్ కార్డు నుంచి 3 లక్షల 77 వేల రూపాయలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. 36 గంటలపాటు ఆమెను ఇంట్లోనే డిజిటల్ అరెస్ట్ చేశారు.. ఆమె బ్యాంక్, క్రెడిట్ కార్డుల్లో డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత.. మిమ్మల్ని మళ్లీ విచారిస్తాం.. అప్పటి వరకు ఎవరికీ సమాచారం ఇవ్వొద్దు అంటూ లాగ్ ఆఫ్ అయ్యారు.. 

36 గంటల డిజిటల్ అరెస్ట్ తర్వాత.. ఆమె మరింత సమాచారం కోసం బెంగళూరు సిటీ శివాజీనగర్ లోని ఈస్ట్ డివిజన్ లో ఉన్న CEN క్రైం పోలీస్ స్టేషన్ లో ఎంక్వయిరీ చేసింది. అసలు విషయం అప్పుడు తెలిసింది. మోసపోయాను అని.. బాధితురాలి పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు బెంగళూరు క్రైం పోలీసులు. ప్రాథమిక విచారణలో.. ఇది సైబర్ క్రైం నేరగాళ్ల పని అని.. అందరూ ఫేక్ అధికారులు అని.. సీబీఐ, ఈడీ ఎవరూ కాల్ చేయలేదని స్పష్టం చేశారు బెంగళూరు క్రైం పోలీసులు. దేశంలోనే ఫస్ట్ టైం.. 36 గంటలు డిజిటల్ అరెస్ట్ కావటం అనేది అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..