OMG : వాటర్ పైప్ లైన్ కోసం తవ్విన గుంత.. బైక్ తో పడి వ్యక్తి మృతి

OMG : వాటర్ పైప్ లైన్ కోసం తవ్విన గుంత.. బైక్ తో పడి వ్యక్తి మృతి

బెంగళూరులో ఘోరం జరిగింది. వాటర్ పైప్‌లైన్ కోసం తవ్వున గొయ్యిలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదం ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని రికవరీ చేసి పోస్ట మార్టం నిమిత్తం ప్ఱభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 ముగ్గరు వ్యక్తులు ఒకే బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి లోతైన గొయ్యిని చూడలేక అందులో అదుపు తప్పి పడ్డాడు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేసి పోస్ట మార్టం నిమిత్తం ప్ఱభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు గొయ్యిని బారికేడ్ చేయడం,  రైడర్‌లను దారి మళ్లించడానికి సైన్ బోర్డులు పెట్టడం లేదని అధికారులను నిలదీశారు. జలమండలి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు ఫిర్యాదు చేశారు. బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు స్పందిస్తూ బారికేడ్లు ఉన్నాయని, ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఉండడం వల్ల గుర్తులు తప్పాయని ఆరోపించింది. ఘటన పై కేసు నమోదు చేసుకున్నామని దర్యప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.