మెట్రో స్టేషన్ సీలింగ్ విరిగింది…

మెట్రో స్టేషన్ సీలింగ్ విరిగింది…

హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి పెచ్చులు ఊడి ఓమహిళ మృతి చెందిన విషయం మరవకముందే.. బెంగళూరులోని మెట్రో కాలేజ్ మెట్రో స్టేషన్ లో సీలింగ్ నుంచి రెండు ప్యానల్ లు విరిగి పడ్డాయి. అయితే ఆ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ ఘటన సెప్టెంబర్ 30వ తారీకున జరుగగా లేటుగా వెలుగులోకి వచ్చింది.  ఆరోజు సాయత్రం జరిగినట్లు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేత్ స్పందించారు. త్వారలోనే స్టేషన్ కు మరమ్మత్తులు చేయిస్తామని చెప్పారు.