బెంగళూరు మహా నగరం ఇప్పుడు మంచినీటి కోసం అల్లాడిపోతుంది. నీటి కష్టాలతో సిటీ జనం పరేషాన్ అవుతున్నారు. ఒక్క నీటి చుక్క ఇప్పుడు బంగారం అయ్యింది. సిటీకి మంచినీటి సరఫరా, వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది కర్నాటక ప్రభుత్వం. ఆ ఆంక్షలు ఎలా ఉన్నాయో చూద్దాం..
>>> మంచినీళ్లు.. తాగటానికి ఉపయోగంగా ఉంటే ఏ నీటిని అయినా సరే.. కార్లు కడగటానికి.. వాహనాలు కడగటానికి ఉపయోగించకూడదు. అలా చేసినట్లయితే 5 వేల రూపాయలు ఫైన్.
>>> తాగటానికి ఉపయోగంగా ఉంటే నీటిని గార్డెనింగ్ కోసం ఉపయోగించరాదు.
>>> మంచి నీళ్లను నిర్మాణాలకు ఉపయోగించొద్దు.. కొన్ని రోజులు నిర్మాణాలను నిలిపివేయాలి.
>>> వాటర్ ఫౌంటెయిన్స్ అనేవి ఉపయోగించొద్దు.. వాటి కోసం నీళ్లను వేస్ట్ చేయొద్దు.
>>> ఇంట్లో కనీస అవసరాల కోసం మాత్రమే మంచినీళ్లను ఉపయోగించాలి.. అలా కాకుండా అనవసరం అయిన వాటికి ఉపయోగించినట్లు తెలిస్తే.. 5 వేల రూపాయల ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
>>> బోర్ల వినియోగంపైనా ఆంక్షలు విధించింది. ఎలా పడితే అలా.. ఇష్టమొచ్చినట్లు బోర్లలోని నీటిని తోడేయొద్దని ఆదేశించింది. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ లెవల్స్ దారుణంగా పడిపోవటంతో.. కొన్ని ప్రాంతాల్లో బోర్ల వినియోగంపైనా ఆంక్షలు విధించింది.
బెంగళూరు సిటీలో వారం రోజులుగా మంచినీటి కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. కాలనీలు, బస్తీలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
