తిరుపతిలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన బెంజ్ కారు

తిరుపతిలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన బెంజ్ కారు

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు డోంట్ కేర్ అంటున్నారు. రహదారులపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదు. తరచూ ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తిరుపతి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి బైపాస్ రోడ్డులో బెంజ్ కారు, ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్  రెండు ముక్కలైంది. స్వల్ప గాయాలతో ట్రాక్టర్ డ్రైవర్ బయటపడ్డాడు.కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

ప్రమాదం దాటికి ట్రాక్టర్ ఇంజిన్ భాగం రెండు ముక్కలై, ట్రాలీ నుంచి విడిపోయి బోల్తా కొట్టింది. అటు ట్రాలీ కూడా తలకిందులుగా రోడ్డుపై పడింది. ట్రాక్టర్ ఇంజిన్ ముందు భాగం ఒకవైపు, డ్రైవర్ కూర్చునే వెనుక భాగం మరోవైపు విసిరేసినట్టుగా పడ్డాయి.ఘటన జరిగిన సమయంలో బెంజ్ కారు వేగం 100 నుంచి 120 కిలోమీటర్లు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. అయితే బెంజ్ కారు  ఢీ కొడితే.. ట్రాక్టర్ రెండు ముక్కలవ్వడం మాత్రం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అంటున్నారు.