ఒక్క బ్లాస్ట్ ఖరీదు రూ. లక్ష కోట్ల నష్టం

ఒక్క బ్లాస్ట్ ఖరీదు రూ. లక్ష కోట్ల నష్టం

బీరుట్‌ బ్లాస్ట్‌‌ లో భారీగా ఆస్తి నష్టం

బీరుట్‌: లెబనాన్‌‌ పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిరక్ష్ల్యం వల్లే పేలుడు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌‌ ఆరేళ్లుగా అక్కడ ఎందుకుందో తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే కొందరు పోర్టు అధికారులను హౌస్‌‌ అరెస్టు చేయమని ఆదేశాలిచ్చింది. బ్లాస్ట్‌‌ వల్ల సుమారు రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని బీరుట్‌‌ గవర్నర్ మర్వాన్‌ అబ్బౌడ్‌ ‌చెప్పారు. 3 లక్షల మందికి పైగా ఇళ్లులేని వారయ్యారన్నారు. బీరుట్‌‌ మొత్తం నామరూపాల్లేకుండా పోయిందని, తమ బతుకులు మళ్లీ బాగుపడేదెప్పుడని జనం ఆవేదన చెందుతున్నారు. సర్కారు నిరక్ష్ల్యం వల్లే పేలుడు జరిగిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే లెబనాన్‌‌ ఆర్థికంగా సతమతమవుతోంది. పైగా కరోనాకారణంగా ఇంకింత దెబ్బ పడింది. మంగళవారం బీరుట్‌‌లో జరిగిన భయానక పేలుడు వల్ల 135 మంది చనిపోగా 5 వేల మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి నగరం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

For More News..

చైనాకు చెందిన 2,500 యూట్యూబ్ చానెల్స్‌‌‌‌పై వేటు

కరోనా వారియర్స్ కు ఇన్సెంటివ్ ఇయ్యట్లే

కట్టకముందే కూలుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు