ఈ బౌలింగ్‌ లైనప్‌తో ఎక్కడైనా గెలవొచ్చు

V6 Velugu Posted on Jun 09, 2021

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పోటీపై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు. టీమిండియా బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం కివీస్‌‌కు అంత సులువు కాదన్నాడు. ప్రస్తుత భారత బౌలింగ్ యూనిట్ అత్యంత బలంగా ఉందని, ఎంతటి బ్యాట్స్‌మెన్‌ను అయినా కంగారెత్తించగల సత్తా వారికి ఉందన్నాడు. 

‘నేను ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతున్న సమయాన్ని చూసుకుంటే కపిల్‌దేవ్, జవగళ్ శ్రీనివాస్ లాంటి బౌలర్లు భారత్‌ను బాగా నడిపించారు. ప్రస్తుత బౌలింగ్ అటాక్‌ను చూసుకుంటే.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. పేసర్లు కూడా మంచి సత్తా ఉన్న వాళ్లే. ఈ బౌలింగ్ లైనప్‌తో ఎలాంటి కండీషన్స్‌లో అయినా ఆడొచ్చు, ఎక్కడైనా గెలవొచ్చు. ఈ లైనప్‌లో వైవిధ్యత బాగుంది’ అని మెకల్లమ్ మెచ్చుకున్నాడు. 

Tagged Team india, Ravichandran ashwin, New Zealand, Ravindra Jadeja, Bowlewrs, Brendon McCullum, WTC Final Match

Latest Videos

Subscribe Now

More News