సూర్యాపేట కలెక్టర్ కు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు

సూర్యాపేట కలెక్టర్ కు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు

సూర్యాపేట, వెలుగు : ఎన్నికల నిర్వహణలో విశేష  కృషి చేసినందుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్  ఎస్.వెంకటరావు  2023 ఏడాదికి బెస్ట్ ఎలక్టోరల్  ప్రాక్టీసెస్  అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎలక్టోరల్  ప్రాక్టీసెస్  విభాగం కింద వెంకటరావును ఎంపిక చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నిర్వహించే  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో గవర్నర్  తమిళిసై చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.