మీరు వృత్తిపరంగా టైలరా..? లేక ఇప్పుడు బట్టలుకుట్టడం నేర్చుకుంటున్నారా..? మీరు స్వతహాగా ఫ్యాషన్ డిజైన్లు సృష్టించాలనుకుంటున్నారా? మీ టైలరింగ్ కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా.. బెస్ట్ కుట్టు మిషన్ల కోసం చూస్తున్నారు. అయితే మీకోసం వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన కుట్టుమిషన్ల గురించి తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో రెడీ మేడ్ బట్టలు వాడకం పెరిగిపోయినప్పటికీ కొంతమంది వారికి కంఫర్ట్ గా దుస్తులను కుట్టించుకోవడం కోసం టైలరింగ్ షాపుకే వెళ్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు.. మార్కెట్లో కి వచ్చిన కొత్త డిజైన్లను తమకు నచ్చిన విధంగా కుట్టించుకుంటుంటారు. మరొకొందరు ప్రత్యేకంగా టైలరింగ్ నేర్చుకొని ఇంట్లోనే చిన్నపాటి షాపులను నిర్వహిస్తుంటారు.. అలాంటి వారికి కుట్టుమిషన్ల ఎంపికపై అనేక సందేహాలుంటాయి.
కుట్టుమిషన్ నేర్చుకోవాలనుకునేవారికి, ఇప్పటికే ఎక్స్ పర్ట్స్ అయిన వారి కుట్టుమిషనర్ పరికరాలను అప్ గ్రేడ్ చేసుకోనేందుకు కొన్ని అత్యుత్తమైన కుట్టు మిషన్లు, వాటి లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.
Also Read :- రూ.20వేల డిస్కౌంట్తో లాప్టాప్స్
ఉషా జానోమ్ డ్రీమ్ స్టిచ్ జిగ్-జాగ్ ఎలక్ట్రిక్ కుట్టు యంత్రం
కుట్టు మిసన్లలో ఉషా అత్యుత్తమమైనది. ఇది ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఉషా జానోమ్ డ్రీమ్ స్టిచ్ ఆటోమేటిక్ జిగ్ జాగ్ ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ ఇప్పడే నేర్చుకుంటున్నవారికి, ఇప్పటికే స్టిచ్చింగ్ రంగంలో ఉన్నవారికి బెస్ట్ వన్. ఇది 7 రకాల ఇంటర్నల్ కుట్లు, 14 స్టిచ్ ఫంక్షన్లను అందిస్తుంది. నిమిషానికి 550 కుట్టువేగంతో మీ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తుంది. స్టిచ్ పొడవు నియంత్రణ, ట్రిపుల్ స్టెంత్ స్టిచ్ ఎంపికలు స్టిచ్చింగ్ ను బలంగా, చక్కగా చేస్తుంది.
దీని అసలు ధర రూ. 11వేల 400 లు ఉండగా.. డిస్కౌంట్ తర్వాత రూ.9వేల 999లు.
CHILLAXPLUS కుట్టు మిషన్..
CHILLAXPLUS కుట్టు మిషన్.. ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకునేవారికి బెస్ట్ వన్. ఇంటి కుట్టు పనికి మంచి ఎంపిక. ఇది జిగ్ జాగ్, పికో, రివర్స్ స్టిచ్ వంటి 12 స్టిచ్ ప్యాటర్న్ లను కలిగి ఉంటుంది. ఈ కుట్టుమిషన్ బలమై మెటల్ ఫ్రేమ్ తో తయారు చేయబడింది. ఇందుల బెస్ట్ ఫీచర్ ఇంటర్నల్ గా ఉన్న LED లైట్. ఇది కళ్లకుఇబ్బంది లేకుండా కుట్టుపని చేసేటప్పుడు సహాయపడుతుంది. ఇది పీకో ప్రెస్సర్ ఫుట్ ను కూడా కలిగి ఉంటుంది.
దీని ధర రూ. 11వేల 999 లు.
సింగర్ 4423 హెవీ డ్యూటీ జిగ్ జాగ్ కుట్టు మిషన్
సింగర్ 4423 హెవీ డ్యూటీ జిగ్ జాగ్ కుట్టు యంత్రం కుట్టుపనిని ఇష్టపడే ఎవరికైనా బెస్ట్ ఆప్షన్. ఇది 23 ఇంటర్నల్ కుట్లు, 97 స్టిచ్ అప్లికేషన్లను కలిగి ఉంది. ఇది మీ ప్రాజెక్ట్‌లకు రకరకాల డిజైన్లను అందిస్తుంది. ఈ యంత్రం నిమిషానికి 1,100 కుట్లు కుట్టగలదు. ఇది మీ పనిని త్వరగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. మోటారు 60శాతం బలంగా ఉంది. మందపాటి బట్టల ద్వారా కుట్టడం సులభం అవుతుంది. దీని హెవీ డ్యూటీ మెటల్ ఫ్రేమ్ స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి ఇది చాలా కాలం పాటు ఉండే మన్నికైన యంత్రం.
స్టెయిన్‌లెస్ స్టీల్ బెడ్‌ఫ్రేమ్..కుట్టేటప్పుడు ఫాబ్రిక్ సజావుగా కదలడానికి సహాయపడుతుంది. ఏ రకమైన ఫాబ్రిక్‌తోనైనా బాగా పనిచేసే నమ్మదగిన , శక్తివంతమైన కుట్టు యంత్రం కోసం వెతుకుతున్నట్లయితే సింగర్ 4423 అనేది ప్రతి టైలర్ కు మంచి ఎంపిక.
దీని అసలు ధర రూ. 34వేల 800 కాగా.. డిస్కౌంట్ తర్వాత రూ. 26వేల999