సింగరేణి ఉత్తమ ఉద్యోగులు వీరే..

సింగరేణి ఉత్తమ ఉద్యోగులు వీరే..
  •    శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల బెస్ట్ సింగరేణియన్లుగా మధుసూదన్​రావు, అంకులు

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో బెస్ట్​ సింగరేణియన్లు, ఏరియా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు శ్రీరాంపూర్​ డీజీఎం అనిల్​కుమార్, మందమర్రి పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్​ బుధవారం వేర్వేరుగా తెలిపారు. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల బెస్ట్​ సింగరేణియన్లుగా ఆర్కే-5 మైన్ ఎస్డీఎల్​ ఆపరేటర్ ​అటికం శ్రీనివాస్, కాసిపేట1 గని కోల్ ​కట్టర్ పొలవేని అంకులును ఎంపిక చేశామన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే రిపబ్లిక్ ​వేడుకల్లో సీఎండీ బలరాంనాయక్, డైరెక్టర్లు వీరిని సన్మానిస్తారని వెల్లడించారు. 

శ్రీరాంపూర్​ఏరియా ఉత్తమ ఉద్యోగులు

శ్రీరాంపూర్​ఏరియా స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా బండ మధుకర్, సీహెచ్.ప్రవీణ్​(ఆర్కే-5), రంగు రమేశ్​కుమార్, బొజ్జ రాజయ్య(ఆర్కే-6), బుద్దే శ్రీనివాస్, కొండిపాక వెంకటి(ఆర్కే-7), జె.దీక్షిత్, ఎన్.వెంకటేశ్వర్లు(ఆర్కే న్యూటెక్), రెంటల నారాయణరెడ్డి, ఎగుడ మధుకర్​(ఎస్సార్పీ1), దైదా బాబురావు, బైండ్ల శ్రీనివాస్​(ఎస్సార్పీ3,3ఏ), బొడకుంట లక్ష్మయ్య, బొడ్డు తిరుపతి​(ఇందారం1ఏ), ఆత్మకూరి వెంకటేశ్, నంది రమేశ్ (ఇందారం ఓసీపీ), కొత్తపల్లి శ్రీనివాస్, ఎనగందుల రాజయ్య (శ్రీరాంపూర్​ఓసీపీ), రావిపాటి శ్రీనివాస్​రావు (శ్రీరాంపూర్​ సీహెచ్​పీ)ని ఎంపిక చేశారు. 

మందమర్రి ఏరియా ఉత్తమ ఉద్యోగులు

షేక్​ఇస్మాయిల్, బి.శ్రీనివాస్(శాంతిఖని), బియ్యాల వెంకటేశం, కన్నోజు నాగేశ్వర్​రావు(కాసిపేట), కట్ట ఉదయ్​మోహన్, ఆర్.తిరుపతి( కాసిపేట-2), మురుకుంట్ల మల్లేశ్, కడలి సత్యనారాయణ(కేకే5), పూసల ప్రకాశ్, కవటం సురేశ్​( కేకేఓసీపీ), రాపోలు శ్రీనివాస్​(ఆర్కేపీ సీహెచ్​పీ)ను బెస్ట్​ ఎంప్లాయ్​గా ఎంపిక చేశారు. వీరిని ఆయా ఏరియా పరిధిలో జరిగే వేడుకల్లో సన్మానించనున్నారు.