ముగ్గురు ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డులు

ముగ్గురు ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డులు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డులు దక్కాయి. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా నవాబ్‌‌‌‌‌‌‌‌పేట జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌ ఉన్నత పాఠశాలకు చెందిన టి.ఎన్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌ ఉన్నత పాఠశాలకు చెందిన కందాల రామయ్య, హైదరాబాద్​ నాచారం ఢిల్లీ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సునీత రావులకు ఈ అవార్డులు వరించాయి. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ‘టీచర్స్ డే’ ప్రోగ్రాంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉపాధ్యాయులు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. గురువులు కేవలం విద్యనే కాకుండా ప్రేమను, స్ఫూర్తిని అందించారన్నారు. కుటుంబం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వ బలంతో తన గ్రామంలో కాలేజీకి వెళ్లిన మొదటి బాలిక తానేనన్నారు. జీవితంలో ఏం సాధించినా ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని చెప్పారు. 

మాతృభాషలో బోధించాలి
సైన్స్,రిసెర్చ్, ఇన్నోవేషన్ నాలెడ్జ్ అభివృద్ధికి ఆధారమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. ఈ రంగాల్లో దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ పునాది అని చెప్పారు. జీవితంలో జీవించే కళను నేర్పేది తల్లులే అని చెప్పారు. అందుకే సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్ర్తాల్లో అసలైన ప్రతిభ మాతృభాషతోనే సాధ్యమన్నారు. ఉపాధ్యాయులు కూడా మాతృభాషలో బోధిస్తే విద్యార్థులు తమ ప్రతిభను సులభంగా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఇదే అంశాన్ని నేషనల్ 
ఎడ్యూకేషన్ పాలసీ 2020 నొక్కి చెబుతున్నదని గుర్తు చేశారు.