తక్కువ ధరలో బెస్ట్ యుటిలిటీ గాడ్జెట్స్ ఇవే..

తక్కువ ధరలో బెస్ట్ యుటిలిటీ గాడ్జెట్స్  ఇవే..

టెక్నాలజీ మారుతున్న కొద్దీ మార్కెట్​లోకి కొత్త గాడ్జెట్స్​ వస్తూనే ఉన్నాయి. అవి రోజూవారీ పనులను కాస్త ఈజీ చేస్తుంటాయి. వాటిలో నుంచి కొన్ని బెస్ట్ యుటిలిటీ గాడ్జెట్స్​ ఇవి. వీటి ధర 600 రూపాయల కంటే తక్కువే. అవసరమనుకుంటే ఇలాంటి గాడ్జెట్స్​ కొని ట్రై చేయొచ్చు.

సోలార్​ గార్డెన్​ లైట్​ 

గార్డెన్​ పగటి పూట చాలా అందంగా కనిపిస్తుంది. కానీ.. చీకట్లో కూడా అందంగా కనిపించాలంటే ఈ  లైట్​ పెట్టుకోవాలి. దీన్ని గార్డెన్​ డెకరేషన్​ కోసమే మార్కెట్​లోకి తీసుకొచ్చారు. దీనికి హై-కెపాసిటీ బ్యాటరీ, హై కన్వర్షన్ ఎఫిషియెన్సీ పాలీ సిలికాన్ సోలార్ పానెల్‌‌ ఉంటాయి. అందువల్ల పొద్దంతా సోలార్​ ఎనర్జీతో బ్యాటరీ ఛార్జ్​ అవుతుంది. రాత్రంతా లైట్​ వెలుగుతుంది. ఇందులో 600 ఎంఎహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీంతో సుమారు-12 గంటలపాటు ఏడు రంగుల్లో ఈ లైట్​ వెలుగుతుంది. వామ్​​, రెడ్, గ్రీన్​, బ్లూ.. ఇలా ఏడు రంగులు వరుసగా మారుతుంటాయి. ఈ లైట్​ని డాబా, పాత్‌‌వే, లాన్​.. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఐపీ 65 వాటర్‌‌ప్రూఫ్ టెక్నాలజీతో ఉంది ఇది. 

ధర: 599 రూపాయలు

వాటర్​ బాటిల్​

కొందరికి వేడి నీళ్లు​ తాగే అలవాటు ఉంటుంది. బాటిల్​లో ఉన్న నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయో తెలియక ఒక్కోసారి నోరు కాల్చుకుంటారు ఈ అలవాటు ఉన్నవాళ్లు. ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్మార్ట్​ వాటర్ బాటిళ్ల​ని అందుబాటులోకి తెచ్చాయి కొన్ని కంపెనీలు. ఈ బాటిల్​లో నీళ్లు పోసి కాసేపు పక్కన పెడితే ఆ నీళ్ల టెంపరేచర్​ బాటిల్ మూత మీద ఉన్న ఎల్​ఇడీ స్క్రీన్​పై డిస్​ప్లే అవుతుంది. ఈ బాటిల్​లో వేడినీళ్లు పోస్తే దాదాపు ఆరు గంటల వరకు చల్లారవు. దీని లోపలి భాగాన్ని ఫుడ్​ గ్రేడ్​ స్టెయిన్​లెస్​ స్టీల్​తో, బయటి కేస్​ని హై క్వాలిటీ మెటల్​తో తయారుచేశారు. ఇందులో అల్ట్రా కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. దీన్ని వాడనప్పుడు ఆటోమెటిక్‌‌గా స్క్రీన్ ఆఫ్ అవుతుంది. అందువల్ల ఒక బ్యాటరీ రెండేండ్ల వరకు పనిచేస్తుంది. 
ధర: 299 రూపాయల నుంచి మొదలు

మినీ ఫ్లాష్​ లైట్​

చీకట్లో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెలుతురు కోసం లైట్​ తీసుకెళ్తుంటాం. కానీ.. కొన్నిసార్లు పెద్ద సైజు బ్యాటరీ లైట్​ పట్టుకెళ్లాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే కాంపాక్టబుల్​ ఫ్లాష్​ లైట్​ వాడితే సరిపోతుంది. ఇది చూసేందుకు చిన్నగా ఉన్నా వెలుతురు మాత్రం బాగా వస్తుంది. పైగా మొబైల్​ ఛార్జర్​ ఉంటే చాలు.. ఎక్కడైనా ఛార్జింగ్​ పెట్టుకోవచ్చు. దీని కెపాసిటీ 350 ల్యూమన్లు. 100 నుంచి -200 మీటర్ల వరకు ఇది వెలుతురు ఇస్తుంది. ఇందులో మూడు మోడ్‌‌లు ఉంటాయి. మొదటి మోడ్​లో స్పాట్‌‌లైట్, రెండో మోడ్​లో హార్డ్ లైట్, మూడో మోడ్​లో డిమ్​ లైట్ వస్తుంది. పాకెట్ -ఫ్రెండ్లీ కాంపాక్ట్ డిజైన్​తో దీన్ని తయారు చేశారు. దీని లైఫ్​ స్పాన్​​ లక్ష గంటల వరకు ఉంటుంది. సైక్లింగ్, క్యాంపింగ్, హైకింగ్, హంటింగ్, పెట్రోలింగ్, నైట్ ఫిషింగ్ చేసేవాళ్లకు ఇది బెస్ట్​ చాయిస్​. 

ధర: 439 రూపాయలు

మొబైల్​ హోల్డర్​ 

జర్నీలో ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్​లో వీడియోలు చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాగని వీడియోలు చూసినంత సేపు ఫోన్​ చేతిలో పట్టుకుని ఉండటం కష్టం. మొబైల్​ హోల్డర్​పై పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ, అది ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉండదు. అందుకే ఇలాంటి ఇన్విజిబుల్​ మొబైల్​ హోల్డర్​ని వాడితే సరిపోతుంది. దీన్ని ఫోన్​ వెనకభాగంలో స్టిక్​ చేయొచ్చు. చాలారోజుల వరకు పాడు కాదు కూడా. దీన్ని ఉపయోగించి ఫోన్​ని నిలువుగా 60 డిగ్రీల యాంగిల్​లో, అడ్డంగా 40 డిగ్రీల యాంగిల్​లో పట్టుకోవచ్చు. ఇది కేవలం 0.15 అంగుళాల మందం ఉంటుంది. కాబట్టి, ఫోన్​కి అడిషనల్​గా యాడ్​ చేసినట్టు ఉండదు. బరువు కూడా కేవలం 22 గ్రాములు ఉంటుంది. 
ధర: 369 రూపాయలు