మీ ఇంటిలో వింటేజ్‌‌ లుక్‌‌ కావాలంటే

మీ ఇంటిలో వింటేజ్‌‌ లుక్‌‌ కావాలంటే

సొంత ఇల్లు అనేది అందరికీ ఒక కల. దాన్ని సాకారం చేసుకోడానికి చాలా కష్టపడతారు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో దానికి మంచి కలర్స్‌‌ వేసి, ఇంటీరియర్‌‌‌‌ను అందంగా డెకరేట్‌‌ చేసి మంచి లుక్‌‌ను తీసుకురావడం కూ‌‌‌‌డా అంతే కష్టం. ఇంటీరియర్‌‌‌‌ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌‌ ఉంటుంది. కొందరు సింపుల్‌‌గా డెకరేట్‌‌ చేసుకుంటే, కొందరేమో రిచ్‌‌లుక్‌‌లో డిజైన్ చేసుకుంటారు. ఇంకొందరు వింటేజ్‌‌ ఫీల్‌‌ రావడానికి డెకరేట్‌‌ చేసుకుంటారు. దీనివల్ల పాతరోజుల్లో ఉండే ఇండ్లను చూసిన ఫీల్‌‌ వస్తుంది. ఈ వింటేజ్‌‌ లుక్‌‌ డెకరేషన్‌‌కు  కావల్సినవన్నీ ఆన్‌‌లైన్‌‌లో, హోమ్‌‌ డెకరేషన్‌‌ షాప్‌‌ల్లో దొరుకుతున్నాయి. పాత కాలంవే కావాలని వేలంలో కూడా కొంటారు కొందరు. ఓల్డ్‌‌ ఫర్నిచర్‌‌‌‌: దీనివల్ల ఇంటి లుక్‌‌ మొత్తం మారుతుంది. అలాగే ఇంటి డిజైన్‌‌ స్టైల్‌‌గా ఉంటుంది. అందులో కల్చర్‌‌‌‌ కనబడుతుంది. ఇలాంటి ఫర్నిచర్‌‌‌‌ తయారీకి మొత్తం టేకు, రోజ్‌‌ ఉడ్‌‌నే వాడుతారు. వీటిని ఎక్కువగా ఆంగ్లో– ఇండియన్‌‌ స్టైల్‌‌లో చెక్కుతారు.

సెరామిక్స్‌‌: ఆసియా నుండి ఎగుమతి అయ్యే సెరామిక్‌‌ వస్తువులకు మంచి డిమాండ్‌‌ ఉంది. ట్రెడిషన్‌‌ను చూపించేవి, జంతువులు, పువ్వులు... రకరకాల డిజైన్స్‌‌లో ఉండే ఈ సెరామిక్‌‌ వస్తువులు ఇంటి డెకరేషన్‌‌లో ఫ్లవర్‌‌‌‌ వేజ్‌‌లాగ పెట్టడానికి, టీ ఫ్లాస్క్‌‌లు, ప్లేట్స్, వాల్‌‌ టైల్స్‌‌లాగ కూడా ఉంటాయి. క్రిస్టల్‌‌ ఆబ్జెక్ట్స్‌‌: అంటే గ్లాస్‌‌ ప్రొడక్ట్స్‌‌ లేదా ట్రాన్స్‌‌పరెంట్‌‌గా ఉండేవి. వింటేజ్‌‌ హోమ్‌‌ డెకరేషన్‌‌లో క్రిస్టల్‌‌ ఆబ్జెక్ట్స్‌‌ చాలా అవసరం. వీటి వల్లనే ఇంటికి మరింత లుక్‌‌ వస్తుంది. షాండ్లియర్స్‌‌, ఫ్లోర్‌‌‌‌ ల్యాంప్‌‌లు, క్రిస్టల్‌‌ ఐటమ్స్‌‌ను ఇంట్లో మంచి ప్లేస్‌‌ చూసి డెకరేట్‌‌ చేస్తేనే వాటి లుక్ కనిపిస్తుంది. 

పర్షియన్‌‌ కార్పెట్స్‌‌: ఇంటి ఫ్లోర్‌‌‌‌కు వింటేజ్‌‌ లుక్‌‌ కోసం కావల్సినవి పర్షియన్‌‌ కార్పెట్స్‌‌. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎక్కువగా సిల్క్‌‌, ఊల్‌‌ కలిపి తయారుచేస్తారు. నేచురల్‌‌ కలర్స్‌‌నే వాడతారు. డిఫరెంట్‌‌ డిజైన్స్‌‌లో దొరికే వీటి తయారీకి చాలారోజులు పడుతుందట. లగ్జరీ లుక్‌‌కు సింబాలిక్‌‌ ఈ పర్షియన్ కార్పెట్స్‌‌. సిల్వర్‌‌‌‌ ఐటమ్స్‌‌: వెండి వస్తువులను ఎక్కువగా డైనింగ్‌‌ టేబుల్‌‌ పైన ఉంచుతారు. వీటి వల్ల ఒక క్లాసీరిచ్‌‌ లుక్‌‌తో ఇంటికి ఒక మెరుపు వస్తుంది. వింటేజ్‌‌ క్లాక్‌‌: ఇవి ప్రత్యేకంగా డిజైన్‌‌ చేసినవి దొరుకుతాయి. చెక్కతో తయారుచేసిన పెద్దపెద్ద డిజైన్‌‌ వాల్‌‌ క్లాక్స్‌‌ వల్ల ఇంటికి వింటేజ్‌‌ లుక్‌‌ వస్తుంది.