శ్రుతిహాసన్ 'బెస్ట్ సెల్లర్‌‌‌‌‌‌‌‌' వచ్చేసింది

శ్రుతిహాసన్ 'బెస్ట్ సెల్లర్‌‌‌‌‌‌‌‌' వచ్చేసింది

ఓ ఫేమస్ నవలా రచయిత. అతణ్ని పిచ్చిగా ఆరాధించే అభిమాని. అనుకోకుండా వీళ్లిద్దరికీ పరిచయమవుతుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో తెలియాలంటే ‘బెస్ట్ సెల్లర్‌‌‌‌‌‌‌‌’ వెబ్ సిరీస్ చూడమంటోంది శ్రుతీహాసన్. ఇందులో రైటర్‌‌‌‌‌‌‌‌ తాహిర్ వజీర్‌‌‌‌‌‌‌‌గా అర్జన్‌‌‌‌ బజ్వా నటిస్తుంటే.. అతని ఫ్యాన్‌‌‌‌గా శ్రుతి నటించింది. ఫిబ్రవరి 18 నుంచి అమెజాన్‌‌‌‌లో స్ట్రీమ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. శ్రుతి పని చేసే కాఫీ షాప్‌‌‌‌కి ఓరోజు తాహిర్ వస్తాడు. ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. శ్రుతి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఫేస్ చేసిందని తెలిసి ఆమె కథను రాయడం మొదలుపెడతాడు తాహిర్. అక్కడ్నుంచి అతనికి కష్టాలు మొదలవుతాయి. ఎవరో ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. అతనితో రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేసి హింసిస్తుంటారు. చివరికి తాహిర్‌‌‌‌‌‌‌‌ని ఓ నేరస్తుడిగా చిత్రీకరించడంతో అతను అరెస్టయ్యే పరిస్థితి వస్తుంది. కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ మిథున్ చక్రవర్తి ఎంటరవుతాడు. అసలు తాహిర్ జీవితంలో ఏం జరుగుతోంది, అతని జీవితంలోకి శ్రుతి ఎందుకొచ్చింది, అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో కనిపించిన ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్‌‌‌‌ క్యూరియాసిటీని పెంచడంతో ఇది కచ్చితంగా బెస్ట్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ అయ్యుండొచ్చనిపిస్తోంది.