
టెక్నాలజీ ఎంత డెవలప్ అయితే సైబర్ నేరగాళ్లు అంతగా అప్ గ్రేడ్ అవుతున్నారు. సైబర్ నేరాలకి ఎన్ని అడ్డుకట్టలు వేసిన, ఎన్ని చర్యలు తీసుకున్న ఎక్కడో ఒక చోట, ఎదో ఒక కొత్త రూపంలో పుట్టుకొస్తునే ఉంది. సైబర్ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ లిస్ట్ చాల పెద్దదే...
అయితే సైబర్ మోసగాళ్ళు ఇప్పుడు Google అఫీషియల్ సెక్యూరిటీ అలెర్ట్ లాగా కనిపించే నకిలీ ఇమెయిల్‌లు పంపుతున్నారు. ఈ ఇమెయిల్‌లు సాధారణంగా '‘Suspicious sign-in detected' లేదా 'Security risk found.' అంటూ కనిపిస్తాయి. అందులో 'Check activity' లేదా 'Secure your account' వంటి లింక్‌లు కూడా ఉంటాయి.
మీరు ఈ లింక్‌లను క్లిక్ చేస్తే మీకు Googleలాగా కనిపించే నకిలీ లాగిన్ పేజీకి ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మోసగాళ్ళు మీ వివరాలను దొంగిలించి మీ అకౌంట్, పర్సనల్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ సహా అన్ని హ్యాక్ చేస్తారు.
మోసగాళ్లు ఇప్పుడు Google నుండి వచ్చినట్లు కనిపించే నకిలీ అలర్ట్స్ పంపడానికి ఫిషింగ్ ఈమెయిళ్ళను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా Gmailకు 250 కోట్ల మంది వినియోగదారులు ఉండటంతో హ్యాకర్లు ఎక్కువగా వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. సమాచారం ప్రకారం, కేవలం 36% మంది మాత్రమే వాళ్ళ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. దీనిని హ్యాకర్లు అనుకూలంగా మల్చుకోని వాడుకుంటున్నారు.
ఈ గూగుల్ సైన్-ఇన్ అలర్ట్స్ మీకు నిజమైనవిగా అనిపించవచ్చు, కానీ అవి మీ లాగిన్ వివరాలను దొంగిలించడానికి రూపొందించిన ఒక ఉచ్చు. ఇలాంటి ఈమెయిలు పంపిన వారి అడ్రస్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం మంచిది, అలాగే తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండండి, మీ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. టు-ఫాక్టర్స్ అతేంటికేషన్ ఆన్ చేయడం వల్ల ఇలాంటి స్కామ్‌లలో పడకుండా ఉండొచ్చు.