కెమెరాలు చూస్తున్నయ్‌ జాగ్రత్త!

V6 Velugu Posted on Sep 24, 2021

షాపింగ్‌‌కి మాల్‌‌కు వెళ్తాం. బట్టలు సెట్‌‌ అవుతున్నాయా? లేదా? అని ట్రయల్‌‌ వేస్తాం. వీకెండ్‌‌ వస్తే చిల్‌‌ అయ్యేందుకు హోటల్‌‌కి వెళ్తాం. లాంగ్‌‌ వీకెండ్‌‌ ఉంటే హాలిడే ట్రిప్‌‌ వేస్తాం. హోటల్‌‌, ట్రయల్‌‌ రూమ్‌‌ ప్లేస్‌‌ ఏదైనా వెళ్లిన పని చేసుకుని వచ్చేస్తాం. చుట్టుపక్కల ఏమున్నాయి అని గమనించం. అయితే, ఈ రోజుల్లో దేన్నీ నమ్మే పరిస్థితి లేదు. హిడెన్‌‌ కెమెరాలు పెట్టి మనల్ని చూస్తున్న వాళ్లపై ఒక కన్ను వేయాలి. హోటల్స్‌‌కు వెళ్లినా, మాల్స్‌‌కు వెళ్లినా, టాయిలెట్స్‌‌కు వెళ్లినా పరిసరాలను గమనించి జాగ్రత్తగా ఉండాలి.

హైదరాబాద్‌‌లోని ఒక డ్రైవిన్‌‌ రెస్టారెంట్​ లేడీస్‌‌ టాయిలెట్‌‌లో హిడెన్‌‌ కెమెరా ఉన్నట్లు గమనించిందో ఇటలీ యువతి. పోలీసులకు కంప్లైంట్‌‌ ఇవ్వడంతో కూపీ లాగారు. వాళ్ల దగ్గర ఎన్నో వీడియోలు ఉన్నట్లు తేలింది. ఈ విషయం బయటికి వచ్చాక ఆ డ్రైవిన్‌‌కి వెళ్లిన మహిళలంతా బిక్కు బిక్కుమంటున్నారు. తమ వీడియోలు ఎక్కడికి? ఎవరికి? పంపారో అని తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే ఎవరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, చుట్టూ గమనించుకుంటే కెమెరాలకు బలికాకుండా ఉండొచ్చు. అబ్జర్వేషన్‌‌ స్కిల్స్‌‌ పెంచుకోవాలి. ట్రయల్‌‌ రూమ్‌‌, హోటల్‌‌ గదుల్లోని లైట్లు, మిర్రర్‌‌‌‌, ఛార్జింగ్‌‌ హోల్డర్స్‌‌, ఇంటీరియర్‌‌‌‌ డెకార్స్‌‌పై ఒక కన్నేయాలి. స్మోక్‌‌ డిటెక్టర్స్‌‌, టిష్యూ బాక్స్‌‌లు, వాల్‌‌సాకెట్స్‌‌, ఇండోర్‌‌‌‌ ప్లాంట్‌‌ బాస్కెట్స్‌‌పైనా నజర్‌‌‌‌ ఉంచాలి. ఏదైనా వైర్‌‌‌‌ బయటికి వచ్చినట్లు ఉన్నా, వస్తువులు  చెల్లాచెదురుగా ఉన్నా కచ్చితంగా చెక్‌‌ చేయాలి. ట్రయల్‌‌ రూమ్‌‌, హోటల్‌‌ రూమ్‌‌, టాయిలెట్‌‌లో ఉండే అద్దాన్ని గమనించాలి. దానికి హ్యాండ్‌‌ టెస్ట్‌‌ చేయాలి. నార్మల్‌‌ అద్దం అయితే.. దానిమీద వేలిని పెడితే ఆ వేలికి, అద్దానికి మధ్య గ్యాప్‌‌ లేకుండా అతుక్కున్నట్లు కనిపిస్తుంది. అదే డబుల్‌‌ సైడెడ్‌‌ మిర్రర్‌‌‌‌ అయితే అద్దంపై ఉంచిన వేలికి అద్దానికి మధ్య గ్యాప్‌‌ ఉన్నట్లు ఉంటుంది. హైదరాబాద్‌‌లో బయటపడిన కెమెరా సీలింగ్‌‌కి ఉన్న లైట్‌‌లో పెట్టి ఉంది. అంటే..  లైట్లు కూడా గమనించాలన్నమాట. లోపలికి వెళ్లిన తర్వాత అనుమానం వస్తే లైట్లు అన్నీ ఆపేసి ఫోన్‌‌ టార్చ్‌‌ ఆన్‌‌ చేయాలి. ఎక్కడైనా లైట్‌‌ ఫోకస్‌‌ అవుతున్నట్లు అనిపిస్తే అక్కడ కెమెరా ఉందని అర్థం. ఎంత చీప్‌‌ కెమెరా అయినా, కచ్చితంగా ఫ్లాష్‌‌ ఉంటుంది. కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. 

స్పై కెమెరా డివైజ్‌‌తో హిడెన్‌‌ కెమెరాను ఈజీగా కనుక్కోవచ్చు. ఆ డివైజ్‌‌లు ఇప్పుడు ఆన్‌‌లైన్‌‌లో చాలానే దొరుకుతున్నాయి. వాటిని క్యారీ చేస్తే బెటర్‌‌‌‌. బగ్‌‌ డిటెక్టర్‌‌‌‌తో కూడా కెమెరాల్లాంటి వాటిని కనిపెట్టొచ్చు. రూమ్‌‌లోకి వెళ్లిన తర్వాత  అనుమానించదగ్గ వస్తువు ఏదైనా కనిపించినా, ఎక్కువగా వాడాల్సిన అవసరం లేని వస్తువు ఉన్నా వాటిని తీసి డ్రాలో పెట్టేయాలి. లేదా కరెంట్‌‌ సప్లయ్​ ఆపేయడం, వస్తువులపై టవల్స్‌‌ లాంటివి వేసి కప్పేయడం వంటివి చేయాలి. ఇప్పుడు ప్రతి విషయానికి యాప్స్‌‌ అందుబాటులో ఉన్నాయి. అలానే స్పై కెమెరాలను కనుక్కునే యాప్స్‌‌ కూడా ఉన్నాయి వాటిలో. Airbnb, Hidden Spy Camera Detector, Radarbot, Glint Finder, iAmNotified, DontSpy, All Hidden, Ghost Camera Finder లాంటి యాప్‌‌లున్నాయి. వీటిని ఓసారి చెక్‌‌ చేసుకుని వాడితే మంచిది. ఆన్‌‌లైన్‌‌ స్టోర్ల ప్రొటెక్టెడ్‌‌, రేటింగ్‌‌, గైడెన్స్‌‌ల్ని చూసుకోవడంతో పాటు... వాటి గురించి ఇతర వివరాలు తెలుసు కోవాలి. అంతా బాగుంటేనే ఇలాంటి వాటిని వాడితే బెటర్‌‌‌‌.

Tagged Shopping Mall, camera,

Latest Videos

Subscribe Now

More News