కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తునన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
