
ఫేమస్ గేమ్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ను ఆండ్రాయిడ్ యూజర్లు శనివారం నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, ఈ నెల 29 నుంచి మాత్రమే ఆడుకోవడానికి వీలుంటుంది. అదే ఐఓఎస్ యూజర్లయితే డౌన్‌లోడ్, ప్లే రెండూ 29 నుంచే చేయడానికి వీలుంటుంది. ఎక్కువ డౌన్‌లోడ్స్ జరగడంతో ఈ వెసులుబాటు కలిపించామని క్రాఫ్టన్ పేర్కొంది.