భారీ మెజారిటీతో దీదీ గెలుపు

భారీ మెజారిటీతో దీదీ గెలుపు

దేశమంతటా ఆసక్తి కలిగించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలో ఉండడంతో.. దేశ ప్రజలందరి చూపు ఇటువైపే నిలిచింది. అయితే ఉత్కంఠకు తెరదించుతూ దీదీ భారీ మెజారిటీతో గెలిచారు. భవానీ పూర్ నియోజకవర్గంలో మమతా తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ పై 58వేల 832 ఓట్ల మెజారిటీ సాధించారు. గత గురువారం నాడు భవానీపూర్ లో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ లో 53.32శాతం ఓటింగ్ నమోదైంది. 

సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు మమతా బెనర్జీ. ఒకప్పటి తన సహచరుడు అయిన సువేందు అధికారి బీజేపీలో చేరడంతో.. అతడిని డీకొట్టేందుకు తన నియోజకవర్గం భవానీపూర్ ను వదిలి నందిగ్రామ్ లో నిలబడ్డారు. రాష్ట్రమంతటా బంపర్ మెజారిటీ సాధించినప్పటికీ.. నందిగ్రామ్ లో 19 వందలకు పైగా ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. దీంతో భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ నేత శోభన్ దేవ్ రాజీనామా తన పదవిని మమత కోసం త్యాగం చేశారు. ఉపఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది.

మరిన్ని వార్తల కోసం..

బడి కూలుతున్నా.. కొత్త బిల్డింగ్​ పూర్తి చేస్తలేరు

విశేషంగా ఆకట్టుకున్న వీ6 బతుకమ్మ పాటలు

సీఆర్పీఎఫ్ బంకర్ సహా మూడు చోట్ల ఉగ్రదాడులు.. ఒకరు మృతి