
ఓ వైపు కూలేందుకు సిద్ధంగా ఉన్న స్కూల్ బిల్డింగ్ వరండాలో చదువుకుంటున్న స్టూడెంట్స్. మరో వైపు ఇన్ కంప్లీట్‌గా ఉన్న కొత్త బిల్డింగ్. ఇది మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో నెలకొన్న పరిస్థితి. పాపన్నపేట జడ్పీ హై స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కలిపి మొత్తం 540 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూంలు లేవు. దీంతో గత్యంతరం లేక టీచర్లు శిథిలావస్థలో ఉన్న పాత స్కూల్ బిల్డింగ్ వరండాలోనే క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడు పెంకులు ఊడి మీద పడతాయో అని స్టూడెంట్స్ బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం 2018లో రూర్బన్ స్కీం ఫండ్స్ నుంచి రూ.80 లక్షలు కేటాయించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు షురూ చేసి మూడేళ్లయినా కంప్లీట్ కాలేదు. దీంతో స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు.
- పాపన్నపేట, వెలుగు