రాముని సన్నిధిలో ఉగాది పంచాంగ శ్రవణం .. శ్రీరాముడి ఆదాయం :2 వ్యయం: 11

రాముని సన్నిధిలో ఉగాది పంచాంగ శ్రవణం .. శ్రీరాముడి ఆదాయం :2 వ్యయం: 11

భద్రాచలం,వెలుగు :  ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరిగింది. స్థానాచార్యులు స్థలసాయి పంచాంగ శ్రవణం చేశారు.

 శ్రీపరాభవనామ సంవత్సరం అంటే మనిషిలోని చెడుగుణాలకే పరాభవం అని,భక్తులకు కాదని ఆయన పేర్కొన్నారు. కర్కాటక రాశి అయిన శ్రీరాముడికి ఆదాయం 2, వ్యయం 11, రాజభోగం 4, అవమానం  7 అని, కన్యారాశి అయిన సీతమ్మవారికి ఆదాయం 8, వ్యయం 11అని, రాజభోగం 3, అవమానం 3 అని చెప్పారు. దైవ నామస్మరణం ద్వారా భక్తులు సమస్యల నుంచి విముక్తి పొందుతారని పేర్కొన్నారు.