వరంగల్ భద్రకాళీ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ

వరంగల్ భద్రకాళీ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ

కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలను మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 10 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వపరంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అనంతరం వరంగల్​ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించగా, అమ్మవారికి మేళతాళాలతో పట్టు చీరలు, పూజాద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమంలో కటకం పెంటయ్య, రాజన్, శ్రీనివాస్, వెంకటన్న, రవికుమార్, రాజ్​కుమార్, ఈవో శేషు భారతి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.