బ్రహ్మణ్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ల పనులు ప్రారంభం : ఎమ్మెల్యే రామారావు పటేల్

 బ్రహ్మణ్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ల పనులు ప్రారంభం : ఎమ్మెల్యే రామారావు పటేల్
  • పనులు ప్రారంభించిన  భైంసా ఎమ్మెల్యే రామారావు పటేల్ 

భైంసా/ముథోల్, వెలుగు: రూ. 5.80  కోట్లతో చేపట్టనున్న బ్రహ్మణ్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతు పనులను మంగళవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాసర లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.1.30  కోట్లు నిధులు  మంజూరు చేయించినట్లు చెప్పారు. 20 ఏళ్లుగా మన్మథ్​లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్‌లో ఉన్నదని, దీని రిపేర్లకు రూ. 1.40 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.  

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు.  ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండక పోయినప్పటికీ ప్రస్తుతం వరినాట్ల సమయం కావడంతో  రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకోని నీటిని విడుదల చేశామన్నారు. కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.