రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంగా దియా కుమారి ప్రమాణం

రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంగా దియా కుమారి ప్రమాణం

 రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా ప్రమాణస్వీకారం చేశారు.  జైపూర్‌లో  జరిగిన ఈ  ప్రమాణ స్వీకారానికి  ప్రధాని మోదీతో పాటు , కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వీరితో పాటు  మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్,, గోవా సీఎం ప్రమోద్ సావంత్ లు హాజరయ్యారు. 

ఇటీవల తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన  భజన్ లాల్ శర్మను రాజస్థాన్ సీఎంగా  ప్రకటించిన సంగతి తెలిసిందే..సంగవేర్ నుంచి భజన్లాల్ శర్మ మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సీఎం సీటు ఆశించిన మాజీ సీఎం వసుంధరా రాజే స్వయంగా  భజన్ లాల్ శర్మ పేరును ప్రతిపాదించడం మరో ట్విస్ట్.  భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడం.. భజన్ లాల్ శర్మపై బీజేపీ అధిష్టానికి ఉన్న నమ్మకం, పార్టీ పట్ల ఆయనకున్న విధేయతవల్లే సీఎం పదవి వరించింది.

అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ ను పడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన వారం రోజుల తర్వాత రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను బీజేపీ మంగళవారం (డిసెంబర్12) ప్రకటించింది. 

దియా కుమారి ఎవరు? 

దియా కుమారి రాజస్థాన్ బీజేపీ నాయకురాలు. జైపూర్ రాజకుటుంబానికి చెందిన మహారాణి గాయత్రి దేవి మనమరాలు. జైపూర్ లోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ స్థానం  నుంచి ఎన్నికల్లో గెలుపొందింది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో నూ వ్యూహం రచించినబీజేపీ అధిష్టానం.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నర్పత్ సింగ్  స్థానంలో దియా కుమారికి సీటు కేటాయించింది. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు దియాకుమారి రాజ్ సమంద్ ఎంపీగా ఉన్నారు.  రాజస్థా్న్ లో శాంతిభద్రతలు, పేపర్ లీక్ లతో సహా ప్రజాసమస్యలకు వ్యతిరేకంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్ లో నిరసనలకు నాయకత్వం వహించారు దియాకుమారి