
లక్నో: టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అరుణ్ గత సీజన్ వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో పనిచేశాడు. కానీ, 2025 సీజన్‌లో కేకేఆర్ 8వ స్థానంతో నిరాశ పరచడంతో ఇటీవలే ఆ టీమ్ నుంచి వైదొలిగాడు. కోల్‌కతా ఇప్పటికే తమ హెడ్ కోచ్ చంద్రశేఖర్ పండిత్‌ను కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో అరుణ్ లక్నో టీమ్‌లో చేరాడు.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఎల్‌ఎస్‌జీ కూడా గత సీజన్‌లో 7వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇండియా పేసర్ మయాంక్ యాదవ్ చాలా మ్యాచ్‌లకు దూరం కావడంతో ఎల్‌ఎస్‌జీ బౌలింగ్ బలహీనపడింది. కాగా, టీమిండియాకు అత్యుత్తమ బౌలింగ్ కోచ్‌లలో ఒకరిగా పేరుగాంచిన అరుణ్ యువ పేసర్లను తీర్చిదిద్దడంలో సిద్దహస్తుడు. అతని రాక ఎల్‌ఎస్‌జీ బౌలింగ్‌కు లాభం చేరకూర్చనుంది.