టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలె

టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలె
  • హెల్త్ వర్కర్లను కోరిన భారత్ బయోటెక్

న్యూఢిల్లీ: 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్స్ కు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ హెల్త్ వర్కర్లను కోరింది. అప్రూవ్ చేయని వ్యాక్సిన్ ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. టీనేజర్స్ కు వ్యాక్సినేషన్ విషయంలో హెల్త్ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు 12 నుంచి 14 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక కొవిడ్ రోగులు వారం కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉంటే.. టీబీ, ఇతర పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కరోనా పేషెంట్స్ కు స్టెరాయిడ్లు ఇస్తే.. బ్లాక్ ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 158 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 50 శాతం టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలోగా టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సెకండ్ డోస్, బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్ ను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. 

మరిన్ని వార్తల కోసం: 

తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్ బదిలీ

వరంగల్ లో మంత్రుల పర్యటనలో కరోనా కలకలం

ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో జై భీమ్