నేరుగా 14 రాష్ట్రాలకు  కోవాగ్జిన్

నేరుగా 14 రాష్ట్రాలకు  కోవాగ్జిన్


న్యూఢిల్లీ: దేశంలోని 14 రాష్ట్రాలకు మే 1 నుంచే కోవాగ్జిన్​ డైరెక్ట్​ సప్లయ్​ మొదలు పెట్టినట్లు జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 14 రాష్ట్రాలకు ఈ సప్లయ్​ మొదలైందని అన్నారు. సెంట్రల్​ గవర్నమెంట్​ నుంచి వచ్చే కేటాయింపుల ప్రకారమే రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్స్​ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్​  గవర్నమెంట్​ కేటాయింపు పొందిన మరికొన్ని రాష్ట్రాలు కూడా సప్లయ్​ కోరుతున్నాయని సుచిత్ర ఎల్లా ఒక ట్వీట్​లో తెలిపారు. రాష్ట్రాలకు కోవాగ్జిన్​ రేటును అంతకు ముందున్న రూ. 600 నుంచి రూ. 400కి తగ్గిస్తున్నట్లు భారత్​ బయోటెక్​ ఏప్రిల్​ 29న ప్రకటించిన విషయం తెలిసిందే.