హైదరాబాద్, వెలుగు: వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి రూ.కోటి చొప్పున రూ.రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
ఇటీవలి వరదలు విస్తృతంగా విధ్వంసం సృష్టించాయని, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపింది. వీరికి తక్షణం మద్దతు అవసరమని గుర్తించామని, వారి పునరావాసం కోసం ఈ ఆర్థికసాయం అందిస్తున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఇటీవల ఖమ్మం, విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది.