ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకే అందించే కరోనా వ్యాక్సిన్ ఏదంటే..?

ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకే అందించే కరోనా వ్యాక్సిన్ ఏదంటే..?

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాదిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ మూడోదశ హ్యూమన్ ట్రయల్స్ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం మీద 25 సెంటర్లలో 26 వేలమంది ఈ మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. ఈ ట్రయల్స్ ఫలితాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడుదల కానుండగా..అందులో కోవ్యాక్సిన్ పనితీరు బాగుంటే ప్రపంచంలో అతి తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

కాగా నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు తొలిసారి రెండు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లను ప్రయోగిస్తారు. 28రోజుల పాటు ఈ ఇంజెక్షన్ ప్రయోగించిన వాలంటీర్ల ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షిస్తారు. వారి ఆరోగ్యాన్ని బట్టి అదే 28 రోజుల వ్యవధిలో ట్రయల్స్ లో పాల్గొన్న 1:1వంతు వాలంటీర్లకు రెండు ఆరు మైక్రోగ్రాముల ఇంజెక్షన్లు లేదా ప్లేసిబో యొక్క రెండు షాట్లను ఉపయోగిస్తారు. ఇలా ప్రారంభమైన ట్రయల్స్ ను నిర్ణీత వ్యవధిలో పరీక్షించి..భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ కరోనా ను హతమారిస్తే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ఆ సంస్థ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది.