వచ్చే ఏడాదిలో కరోనా వాక్సిన్: భారత్ బయోటెక్

వచ్చే ఏడాదిలో కరోనా వాక్సిన్: భారత్ బయోటెక్

ఏర్పాట్లు చేసుకుంటున్నామని భారత్ బయోటెక్ వెల్లడి

3వ దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ చేయడంపై ఫోకస్

న్యూఢిల్లీ : ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీల నుంచి అవసరమైన అనుమతులు వస్తే వచ్చే ఏడాది రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కరోనా వ్యాక్సిన్ లాంచ్ చేస్తామని భారత్ బయోటెక్ చెప్పింది. దేశంలో ఫేస్ 3 ట్రయల్స్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నిర్వహించడంపై తమ ఫోకస్ ఉంటుందని పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌‌‌‌ఐవీ) కోలాబరేషన్‌‌‌‌తో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేసింది. ఐసీఎంఆర్ ల్యాబ్‌‌‌‌లో ఈ వైరస్‌‌‌‌ను ఐసోలేట్ చేశారు. తమ చివరి దశ ట్రయల్స్‌‌‌‌ సేఫ్టీ డేటా, ప్రయోగాత్మక ఆధారాలు, సమర్థత ఆధారంగా రెగ్యులేటరీ అన్ని రకాల అనుమతులు తమకు ఇస్తే.. వచ్చే ఏడాది క్యూ2లో కరోనా వ్యాక్సిన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ చెప్పారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి తర్వాత కంపెనీ ఫేస్ 3 క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది. ఈ ట్రయల్స్‌‌‌‌ను 13–14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 సైట్లలో నిర్వహిస్తోంది. ఒక్కొక్కరికి రెండు డోస్‌‌‌‌ల వ్యాక్సిన్ వేస్తారు.