అమెరికాలో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ 

V6 Velugu Posted on Jun 12, 2021

కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను తయారు చేసిన భారత్ బయోటెక్.. అమెరికాలోనూ తన వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి  ఇప్పటికే  కొవాగ్జిన్ కు అనుమతి కోరుతూ అమెరికా ప్రభుత్వానికి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తుకు మద్దతుగా కొవాగ్జిన్ కు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని భారత్ బయోటెక్ నిర్ణయించుకుంది. కొవాగ్జిన్ మార్కెటింగ్ అనుమతుల దరఖాస్తు ఆధారంగా అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది. డేటా జనరేషన్, సమాచార పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

భారత్ లో కొవాగ్జిన్ పరిశోధనాత్మక అధ్యయనంపై సమాచారం పంచుకున్నామని తెలిపింది భారత్ బయోటెక్. 1,2,3 దశల క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని ఇప్పటికే అందజేశామని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ వివరాలను నియంత్రణ సంస్థలు పరిశీలించాయని చెప్పింది. టీకా భద్రత, సమర్థత పై 9 ఇన్వెస్టిగేషన్ స్టడీ చేసినట్లు తెలిపింది. భారత్ లో క్లినికల్ ట్రయల్స్ డేటా పంచుకున్న వ్యాక్సిన్  తమదొక్కటేనని స్పష్టం చేసింది. భారతీయులపై వ్యాక్సిన్ సమర్థత వివరాలు పంచుకున్న మొట్టమొదటి సంస్థ కూడా తమదేని తెలిపింది.

Tagged us, Bharat Biotech, Covaxin clinical trials

Latest Videos

Subscribe Now

More News