BELలో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ.17 వేల జీతం.. డైరెక్ట్ సెలెక్షన్..

BELలో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ.17 వేల జీతం.. డైరెక్ట్ సెలెక్షన్..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్, ఆప్షనల్ ట్రేడ్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. నవంబర్ 22న నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఎలిజిబిలిటీ
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2022, జులై 1 లేదా ఆ తర్వాత  గానీ సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.   

ఆప్షనల్ ట్రేడ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2022, జులై 1 లేదా ఆ తర్వాత గానీ సంబంధిత విభాగంలో బీబీఏ / బీబీఎం/ బీబీఎస్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.   

వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు. ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు 5 ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏండ్లు, వికలాంగులకు 10 ఏండ్లు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 22. 

స్టైఫండ్ 
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్: ప్రతి నెలా రూ.17500 చెల్లిస్తారు.

ఆప్షనల్ ట్రేడ్ (బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్):  ప్రతి నెలా రూ.12,500  చెలిస్తారు. 

పూర్తి వివరాలకు  bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.