182 శాతం పెరిగిన భారత్ పే ఆదాయం

182 శాతం పెరిగిన భారత్ పే ఆదాయం

హైదరాబాద్​, వెలుగు: ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ కంపెనీ భారత్ పే 2023 ఆర్థిక సంవత్సరంలో తన ఆర్థిక పనితీరును ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని 182శాతం పెంచుకున్నట్టు తెలిపింది. ఇది 2022  ఆర్థిక సంవత్సరం లో రూ. 321 కోట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 904 కోట్లకు పెరిగింది. పన్నుకు ముందు నష్టం రూ. 5,594 కోట్ల నుంచి రూ. 886 కోట్లకు తగ్గింది.  

ఎబిటా నష్టం కూడా సుమారు రూ. 158 కోట్లు తగ్గింది.ఈ ఫలితాలపై  భారత్ పే  తాత్కాలిక సీఈఓ నలిన్ నేగి మాట్లాడుతూ తమ సంస్థ ఈ సంవత్సరం అసాధారణ పనితీరును సాధించిందని ప్రకటించారు. అన్ని బిజినెస్​ వర్టికల్స్‌‌‌‌‌‌‌‌లో గణనీయమైన వృద్ధి కనిపించిందని చెప్పారు. లోన్లను మరింత పెంచుతామని, పీఓఎస్​ సౌండ్‌‌‌‌‌‌‌‌బాక్స్ వ్యాపారాలను విస్తరిస్తామని వివరించారు.