బాలుడిపై లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్ 

బాలుడిపై లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్ 

రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలుడ్ని ఒక జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ మేరకు బాధితుడి తల్లి భరత్‌పూర్ స్పెషల్ జడ్జి జితేంద్ర గొలియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్జితోపాటు ఆయన సహాయకులు ఇద్దరు తన కొడుకును లైంగింకంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

ఈ కేసులో పోలీసుల చెప్పిన వివరాలు.. ఏడో తరగతి చదువుతున్న ఆ బాలుడు రోజూ ఆటలాడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లేవాడు. అక్కడే జడ్జి జితేంద్రతోపాటు ఆయన సహాయకులు బాలుడితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. పిల్లాడ్ని ఇంటికి తీసుకెళ్లి మద్యం, మాదక ద్రవ్యాలను ఇచ్చేవారు. బాలుడు స్పృహ కోల్పోయాక లైంగికంగా వేధించేవారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని మథుర గేట్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ రామ్‌నాథ్ అన్నారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో జడ్జి జితేంద్రపై వెంటనే సస్పెన్షన్ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే బాలుడ్ని బెదిరించిన ఏసీబీ ఆఫీసర్ పరమేశ్వర్‌‌లాల్‌ యాదవ్‌ కూడా తక్షణమే సస్పెండ్ అయ్యారు. 

మరిన్ని వార్తల కోసం: 

నో డైలాగ్స్: సస్పెన్స్‌‌ రేపుతున్న RRR టీజర్

పునీత్.. ఆ పిల్లల్ని నేను చదివిస్తా: హీరో విశాల్

ఇండియా సెమీస్‌‌ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి