యూటెల్‌‌ శాట్‌‌లో భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ పెట్టుబడి..

యూటెల్‌‌ శాట్‌‌లో భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ పెట్టుబడి..

న్యూఢిల్లీ:  ఫ్రెంచ్ శాటిలైట్ గ్రూప్ యూటెల్‌‌శాట్‌‌లో  భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌కి చెందిన స్పేస్ కంపెనీ భారతీ స్పేస్‌‌  31.4 మిలియన్ యూరోలు (సుమారు రూ. 313 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. యూటెల్‌‌శాట్‌‌ 1.35 బిలియన్ యూరోలు (సుమారు రూ. 11,250 కోట్లు) సేకరించాలని చూస్తోంది. 

ఇందులో భాగంగా భారతీ స్పేస్  ఈ ఫండ్స్‌‌ను ఇన్వెస్ట్ చేస్తుంది. అప్పులు తగ్గించుకోవడానికి,  శాటిలైట్లు పెంచుకోవడానికి ఈ ఫండ్స్‌‌ను యూటెల్‌‌శాట్ ఖర్చు చేయనుంది. ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌‌‌‌లింక్‌‌కు ప్రత్యర్ధి అయిన ఈ కంపెనీలో  ఫ్రెంచ్ ప్రభుత్వం 526.4 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేసి, 29.99శాతం వాటాతో అతిపెద్ద షేర్‌‌హోల్డర్‌‌గా మారనుంది. 

 దీంతో భారతీ స్పేస్ వాటా 18.7శాతానికి తగ్గుతుంది.  షిప్పింగ్ కంపెనీ సీఎంఏ సీజీఎం 100.4 మిలియన్ యూరోలు, సావరిన్ ఇన్వెస్టర్ ఎఫ్‌‌ఎస్‌‌పీ 57.8 మిలియన్  యూరోలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. 2023లో యూటెల్‌‌శాట్, భారతీ ఎంటర్‌‌ప్రైజెస్, యూకే ప్రభుత్వం మద్ధతు ఉన్న వన్‌‌వెబ్ విలీనమయ్యాయి. ఆ తర్వాత, ఈ కంపెనీలో భారతీ గ్రూప్‌‌ వాటా 21.2శాతానికి చేరుకుంది.  యూటెల్‌‌శాట్‌‌లో అతిపెద్ద షేర్‌‌హోల్డర్‌‌గా మారింది.