నాంపల్లిలో ఒక్క ఇల్లు కట్టలేదు..1824 ఇళ్లు కట్టామంటున్నరు

నాంపల్లిలో ఒక్క ఇల్లు కట్టలేదు..1824 ఇళ్లు కట్టామంటున్నరు

లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లపై  టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కు మధ్య  వార్ కొనసాగుతుంది. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టాం చూడండని రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నాంపల్లిలో 1824, జూబ్లిహిల్స్  లో 226  ఇళ్లు కట్టినట్లు లిస్ట్ లో ఉందన్నారు.  కానీ నాంపల్లిలో ఒక్క ఇళ్ళు కూడా కట్టలేదని..తనతో వస్తే చూపిస్తానన్నారు. టీఆర్ఎస్  నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలని కాపాడవలసిన బాధ్యత తమపై  ఉందన్నారు.  24 నియోజకవర్గాలలో 2 లక్షల 40 వేల ఇళ్ళు కట్టాలన్నారు.  ఒక శాసన సభ పరిధిలో 10 వేల ఇళ్ళు కడుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని కట్టారో ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒక్కరోజే లక్షమంది రికవరీ..55 లక్షలకు చేరిన కేసులు

తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు

ఎమ్మెల్సీ సీటు కోసం బీజేపీలో పోటీ