రూ.4.7 కోట్ల షేర్లను అమ్మనున్న భవీశ్ ​అగర్వాల్​

రూ.4.7 కోట్ల షేర్లను అమ్మనున్న భవీశ్ ​అగర్వాల్​

న్యూఢిల్లీ: త్వరలో రాబోతున్న ఐపీఓ ద్వారా ఈ–స్కూటర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్​​భవీశ్​ అగర్వాల్  4.74 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఓలా ఈ పబ్లిక్​ఇష్యూలో దాదాపు రూ.5,500 కోట్ల తాజా ఇష్యూ  ఉంటుంది. అంతేగాక, 95,191,195 ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) ఉంటుంది.

 దీనికి సంబంధించిన ఇష్యూ తేదీ, ప్రైస్​ బ్యాండ్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అగర్వాల్ విక్రయిస్తున్న షేర్లు ఐపీఓ  ఓఎఫ్​ఎస్​ ఖాతాలోకి వస్తాయి. అంటే, మొత్తం డబ్బు ఆయన జేబులోకి వెళ్తుంది. ప్రెష్​ఇష్యూ ద్వారా వచ్చే డబ్బు మాత్రమే సంస్థ ఖాతాలోకి వెళ్తుంది. 

ఐపీఓలో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు)కు, 15 శాతం షేర్లను నాన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్​ఐఐలు) కోసం కేటాయిస్తారు. రిటైల్, వ్యక్తిగత బిడ్డర్లకు 10 శాతం వరకు షేర్లు ఇస్తారు.  2024 లోక్‌‌‌‌సభ ఎన్నికలకు ముందు ఐపీఓ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఓలాకు 2023 సంవత్సరంలో ఆదాయం రూ.2,630.93 కోట్లకు చేరుకుంది.