
ఎ. హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌లో రవి బస్రూర్‌తో గోపీచంద్ మాట్లాడుతున్న ఫొటోస్‌ను మేకర్స్ షేర్ చేశారు.