మాట నిలబెట్టుకున్న మోడీ అభిమాని

మాట నిలబెట్టుకున్న మోడీ అభిమాని

ఢిల్లీ : బీజేపీ 300కు పైగా సీట్లు గెలిస్తే సైకిల్ యాత్ర చేస్తానని ముందుగా చెప్పినందుకు మాట నిలబెట్టుకున్నాడు ఓ మోడీ అభిమాని. గుజరాత్ కు చెందిన బిక్కుభాయ్  అనే అభిమాని… అమ్రేలి నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 17 రోజులు ప్రయాణం చేసి 1100 కిలోమీటర్లు సైకిల్‌ పై ప్రయాణం చేశాడు. అమ్రేలి నుంచి ఢిల్లీ చేరుకొని తన యాత్రను పూర్తిచేశాడు. ఈ సందర్భంగా బిక్కుభాయ్‌ ను కలిశారు ప్రధాని మోడీ.

మాట ప్రకారం విజయవంతగా సైకిల్ యాత్ర పూర్తి చేసిన అతడ్ని ప్రశంసించారు ప్రధాని. సైకిల్ యాత్రతో బిక్కుభాయ్ అనేకమంది ప్రశంసలను అందుకుందన్నారన్నారు మోడీ. బిక్కుభాయ్ సైకిల్ యాత్ర తనను ఎంతగానే ఆకట్టుకుందని.. ట్విట్టర్‌ లో బిక్కుబాయ్ తో కలిసిన దిగిన ఫోటోల్ని షేర్ చేశారు. బిక్కుభాయ్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.