‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

హైదరాబాద్: మెగాస్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మహాశివరాత్రి కానుకగా బుధవారం విడుదలైంది. కళ్లకు స్టైలిష్  గ్లాసెస్, చేతిలో త్రిశూలం లాకెట్ పట్టుకుని.. జిప్సీపై కూర్చున్న చిరు లుక్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు పెంచేలా ఈ లుక్ ఉందని చెప్పొచ్చు. ఇకపోతే, త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న భోళాశంకర్ ను క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. ఇందులో చిరు చెల్లిలి పాత్రలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. మెగాస్టార్ పక్కన మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా యాక్ట్ చేస్తోంది. డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి.. మహతి సాగర్ బాణీలు సమకూర్చుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం

నాలుగు రోజులుగా బంకర్ లోనే..