ఏప్రిల్ 6 వరకు భుజంగరావు, తిరుపతన్నకు జ్యుడిషియల్ రిమాండ్

ఏప్రిల్ 6 వరకు భుజంగరావు, తిరుపతన్నకు జ్యుడిషియల్ రిమాండ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్నల కస్టడీ ఇవాళ్టితో(2024 ఏప్రిల్ 2) ముగిసింది. దీంతో  భుజంగ రావు, తిరుపతన్నను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 2024 ఏప్రిల్ 6 వరకు ఇద్దరికీ జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది నాంపల్లి కోర్టు. భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. 

అంతకు ముందే వైద్య పరీక్షల కోసం ఇద్దరినీ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఇక విచారణలో అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్నల సమాచారం ఆధారంగా పలువురు SIB అధికారులను ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో మొదటిసారి రిటైర్డ్ IG పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ IG, ASP లు తిరుపతన్న, భుజంగ రావు, రాధాకిషన్, ప్రణీత్ రావ్, వేణు గోపాల్ కలిసి ఫోన్ ట్యాపింగ్ లో కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.